Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్Ryan Burl Show: ఆసీస్ పై జింబాబ్వే విజయం

Ryan Burl Show: ఆసీస్ పై జింబాబ్వే విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది.  బౌలర్ రియన్ బర్ల్ ఐదు వికెట్లతో రాణించడంతో ఆసీస్ 141 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని జింబాబ్వే ఏడు వికెట్లు కోల్పోయి 39 ఓవర్లలో సాధించింది,

మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.  తొలి రెండు వన్డేలు గెలిచి ఇప్పటికే సిరీస్ ను ఆసీస్ గెల్చుకుంది. టౌన్స్ విల్లె లోని టోనీ ఐర్లాండ్ స్టేడియంలో నేడు జరిగిన చివరి మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకుంది. ఆసీస్ 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్కడే 96 బంతుల్లో 14ఫోర్లు, 2సిక్సర్లతో  94; మాక్స్ వెల్ 19 పరుగులు చేశారు.  వీరిద్దరూ మినహా మిగిలిన వారంతా సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు.  జింబాబ్వే బౌలర్లలో బర్ల్ ఐదు, బ్రాడ్ ఎవాన్స్ రెండు; నగరవ, న్యుచి, సీన్ విలియమ్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత జింబాబ్వే పరుగుల వేటలో తడబడినా ఓపెనర్ తడివనసే మరుమని-35; కెప్టెన్ రేజిస్ చకబ్వ- 37 (నాటౌట్) నిలకడగా రాణించి గెలిపించారు. ఆసీస్ బౌలర్లలో హాజేల్ వుడ్ మూడు; స్టార్క్, కామెరూన్ గ్రీన్, జంపా, స్టోనిస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

జింబాబ్వే బౌలర్ రియాన్ బర్ల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’….. ఆసీస్ ఆటగాడు ఆడమ్ జంపాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read: India Vs Zimbabwe: ఇండియా క్లీన్ స్వీప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్