Sunday, November 24, 2024
HomeTrending Newsచైనాలో కొత్త వైరస్...ప్రమాదం లేదంటున్న నిపుణులు

చైనాలో కొత్త వైరస్…ప్రమాదం లేదంటున్న నిపుణులు

చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 35మంది ఈ వైరస్​ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ కొత్త వైరస్​ను ‘జూనోటిక్ లాంగ్యా హెనిపా వైరస్​'(లాయ్​వీ)గా పిలుస్తున్నారు. చైనాలోని రెండు రాష్ట్రాల్లో(షాంగ్​డాంగ్​, హెనాన్​) దీనిని గుర్తించారు. కొవిడ్​లాగే.. ఇది కూడా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తీవ్ర జ్వరం, నొప్పులు, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, వికారం వంటివి ఈ ల్యాంగ్యా హెనిపా వైరస్​ లక్షణాలు.

“తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోగుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఒక రోగిలో లాంగ్యా హెనిపావైరస్​ను గుర్తించారు. ఆ తర్వాత విస్తృతంగా నిర్వహించిన పరీక్షల్లో.. 35మందికి ఈ వైరస్​ సోకినట్టు నిర్ధరణ చేశారు,” అని న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురితమైన ఓ అధ్యయనం​ పేర్కొంది.

 

బీజింగ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మైక్రోబయాలజీ అండ్​ ఎపిడమాలజీ, క్వింగ్​డా మున్సిపల్​ సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​, డ్యూక్​- నేషనల్​ వర్సిటీ ఆఫ్​ సింగపూర్​ మెడికల్​ స్కూల్​ అండ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఇన్ఫెక్షన్​ అండ్​ ఇమ్యూనిటీకి చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని రూపొందించారు.

 

ఈ వైరస్ నిఫా వైరస్ ను పోలి ఉంది. ఇప్పటి వరకు వెలుగుచూసిన కేసుల్లో తీవ్ర పరిస్థితులు కనిపించలేదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి,” అని సింగపూర్​ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన వంగ్​ లింఫ వెల్లడించారు.

Also Read : వెలుగులోకి మరో కొత్త వైరస్‌

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్