Sunday, June 7, 2026
HomeTrending Newsఅవినీతి కెసిఆర్ కు చర్లపల్లి జైలే గతి..

అవినీతి కెసిఆర్ కు చర్లపల్లి జైలే గతి..

కేసీఆర్ నరరూప రాక్షసుడుగా మారాడు…కొడుకు ను టాటాను చేశాడు…బిడ్డను బిర్లా ను చేశాడు… ప్రజలపై అప్పులు మోపాడని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్యాసి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరి మీద అప్పు మోపాడని ఘాటుగా విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ రోజు జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం, అధికార పార్టీ నేతలపై పరుశపద జాలం ప్రయోగించారు. ఆదిలాబాద్ జిల్లాలో వెన్నముక లేని నేతలు భజనపరులుగా మారారని, ఎమ్మెల్యే జోకుడు రామన్న, గుడులను గుడి లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్ జిల్లాకు పట్టిన చీడగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

రాష్ట్రానికి సిఎం దలితుడు ఉన్నడా.. దరిద్రుడు ఉన్నాడా అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తాడు. నాడు ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన కుటుంబాలను ఆదుకునే భాధ్యత కాంగ్రెస్ పార్టీ దని ప్రకటించారు. సభలో లక్షకు ఒక్క తల తక్కువగా ఉంటే నా తల వంచుతానన్న రేవంత్ రెడ్డి ఆదివాసీ, దళితుల కొసం సభ పెడితే పోలీస్ లు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. నిన్నటి వరకు ఒక్క లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఉంటుందని, అవినీతి కేసీఆర్ ను బొంద పెడుతానని రేవంత్ చెప్పారు. 20 నెల్ల తరువాత కేసీఆర్ కు చర్ల పల్లి జైలే గతి అని అసలుకు మిత్తితో సహా చెల్లించే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ – కార్యకర్తలే పార్టీ అ అన్న రేవంత్ రెడ్డి సన్యాసి బాల్క సుమన్…కాంగ్రెస్ ఏమి చేసిందని అడుగుతున్నాడని, నువ్వు రిజర్వేషన్ సిట్ లో ఎమ్మెల్యే , ఎంపీ కావడానికి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దళిత ముఖ్యమంత్రి ని  చేస్తా అన్ని చెప్పిన సన్యాసి …ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎవ్వరూ ఉన్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నన్ను ఇంద్రవెళ్లి అమరులకు నివాళులు అర్పించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆదివాసుల బతుకులు మార్చడానికే ఈ సభ నిర్వహించామని, కేసీఆర్ బద్మాసు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలి. అప్పుడే దళిత బంధు లాంటి పథకాలు వస్తాయి అందుకే టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular