ఓబీసీలను గుర్తించే అధికారాలు రాష్ట్రాలకు ఉండేలా “రాజ్యాంగ సవరణ బిల్లు”ను ఈ రోజు లోకసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రేపు,ఎల్లుండి ఈ బిల్లును ఉభయ సభల్లో చర్చ జరిపి ఆమోదించుకునే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. బిజెపి లోకసభ ఎంపీలకు విప్ జారీ. బీజేపీ రాజ్యసభ ఎంపీలకు మంగళ, బుధవారాలకు విఫ్ జారీ. రేపు బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం. బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరపనున్నారు.
అయితే “రాజ్యాంగ సవరణ బిల్లు”ఆమోదంకు సహకరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విపక్ష పార్టీలు. బిల్లు కు ఆమోదం తెలిపిన విపక్ష పార్టీలు వివిధ సవరణలు సూచించే అవకాశం ఉంది.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.