Saturday, March 7, 2026
HomeTrending Newsలాక్ డౌన్ ఆలోచన లేదు - ప్రధాని మోడీ

లాక్ డౌన్ ఆలోచన లేదు – ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వ్యాప్తిపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ  సమావేశమయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, చర్యలపై సమీక్షించారు.

కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని మోడీ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular