Thursday, March 12, 2026
Homeసినిమాసిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం ‘డి.జె..టిల్లు’ టీజర్ విడుదల

సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం ‘డి.జె..టిల్లు’ టీజర్ విడుదల

“రెడీ ఆ రా….
రెడీ అన్నా

ద సూస్కో
కళ్ళు తెరవాలన
ద తెరువు తెరువు తెరువు
ఎట్లా వచ్చిన అట్లాగే ఉన్నా గదర నేను.. ఈడనే ఉన్నది కదర బై మహేష్ బాబు బొమ్మ…రోజూ చూస్తావు కదరా….
ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లైతది అన్నా… ‘డిజె టిల్లు’ టీజర్ లో వినిపించే సంభాషణలు ఇవి.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’ టీజర్ విడుదలైంది. ఈ మేరకు ఓ ప్రచార చిత్రాన్ని కూడా యూనిట్ విడుదల చేసింది. దీన్ని గమనిస్తే… ఏ చిత్రం అయినా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించటానికి టీజర్ అనేది ఓ మొదటి మెట్టు లాంటిది. ఇప్పుడు విడుదల అయిన ఈ సినిమా టీజర్ కూడా అలాంటిదే. పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకునేలా సాగుతుంది. ఇందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి.

విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: విమల్ కృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular