Sunday, October 1, 2023
Homeతెలంగాణకరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం

కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటన. కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం.

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజె(H143)), ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడమైనది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో కేవలం గత 10 రోజుల సమయంలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నది. ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు రెండు లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాలయానికి మే, 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రము, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతోపాటు ఆయా జిల్లాల డి.పి.ఆర్.ఓ.లు ధృవీకరించవలసి ఉంటుంది. ఆయా జర్నలిస్టు సంఘాలు మరణించిన కుటుంబాల తరుఫున ధృవీకరణ పత్రాలు సమర్పించడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. దరఖాస్తుల పంపవలసిన చిరునామా: కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్. ఇతర వివరాలకు టెలిఫోన్ నెం.040-23298672/74 నెంబర్లను సంప్రదించగలరు.

జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఫ్రంట్ లైన్ వారియర్లుగా జర్నలిస్టులను గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు, జర్నలిస్టులందరికీ టీకా కార్యక్రమం, కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు ఆసుపత్రులలో ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే కొత్తగా 200 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడిన వారికి కూడా నేటి నుంచి తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నాము.

(అల్లం నారాయణ)
చైర్మన్,
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,
హైదరాబాద్.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న