-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeతెలంగాణభవిష్యత్ పై త్వరలో నిర్ణయం : ఈటల

భవిష్యత్ పై త్వరలో నిర్ణయం : ఈటల

శ్రేయోభిలాషులు, అనుచరులు, అభిమానులతో చర్చించి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మూడురోజులపాటు రాజేందర్ పర్యటించారు.

గతంలో మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేశామని, తెలంగాణా ఉద్యమ సమయంలో రైల్ రోకో చేసి వందల మందికి అన్నం పెట్టిన చరిత్ర తనకుందని వ్యాఖ్యానించారు. తనతో ఉన్న అనుబంధంతో భవిష్యత్ లో కూడా కలిసి పనిచేస్తామని చెప్పారని, పాత ఉద్యమకారులతో కూడా మాట్లాడానని, అన్ని జిల్లాల నేతలు వచ్చి కలిశారని, తనకు జరిగిన అన్యాయంపై స్పందించారని ఈటల వివరించారు. హైదరాబాద్ వెళ్ళిన తరువాత అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్