Monday, August 10, 2026
Homeసినిమాప్రభాస్ రాధేశ్యామ్.. మరింత ఆలస్యమ్

ప్రభాస్ రాధేశ్యామ్.. మరింత ఆలస్యమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. భారీ పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాని జులై 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో జులై 30న రాధేశ్యామ్ వస్తుందని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇది పిరియాడిక్ మూవీ కావడంతో దీనికి గ్రాఫిక్స్ వర్క్ కాస్త ఎక్కువే ఉంటుంది.

ఇటలీలో చిత్రీకరించిన కొన్ని సీన్స్ ను విఎఫ్ఎక్స్ తో రీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. విఎఫ్ఎక్స్ ప‌నుల‌న్నీ విదేశీ సంస్థ‌ల‌కు అప్ప‌గించారు. అయితే.. కరోనా వలన ఈ ప‌నులు మ‌రింత ఆల‌స్యం అవుతున్నాయి. ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైమ్ కావాలి. అలాగే ఈ మూవీకి సంబంధించి ఒక పాట మరియు కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయాలి. ఇదంతా పూర్తి చేయడానికి చాలా టైమ్ పడుతుంది. ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ మూవీ పాన్ ఇండియా మూవీ. అందుచేత హిందీ మార్కెట్ చాలా కీలకం. మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేయాలి.

అయితే.. 2021 దసరా అయితే.. బాగుంటుందని ఆలోచిస్తున్నారని తెలిసింది. బాలీవుడ్ ట్రేడ్ పండితులు మాత్రం 2021 క్రిస్మస్ కి విడుదల చేస్తే బాగుంటుందని చెప్పారని.. అందుచేత దసరా, క్రిస్మస్ ఈ రెండింటిలో ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందో చిత్రయూనిట్ ఆలోచనలో పడిందని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular