Saturday, June 6, 2026
Homeసినిమాప్రిన్స్ సరసన జాన్వీకఫూర్?

ప్రిన్స్ సరసన జాన్వీకఫూర్?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్న ఈ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కఫూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. జాన్వీ కఫూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేయాలని.. ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సరసన జాన్వీకఫూర్ నటిస్తే బాగుంటుందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆలోచన.

ఈ క్రేజీ సీక్వెల్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించాలి అనుకుంటున్నారు. ఈ సినిమా గురించి ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇదిలా ఉంటే… డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు జాన్వీకఫూర్ ని ట్రై చేశారు కానీ.. జాన్వీ కఫూర్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఇలాచాలా మంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ జాన్వీ కఫూర్ ని టాలీవుడ్ లో పరిచయం చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ.. కుదరడం లేదు.

తాజాగా మహేష్‌ – త్రివిక్రమ్ మూవీలో జాన్వీకఫూర్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. బోనీకఫూర్ జాన్వీకఫూర్ ని టాలీవుడ్ లో పరిచయం చేయాలి అనుకుంటున్నారని… సరైన సినిమా ద్వారా లాంఛ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. మరి.. మహేష్‌ మూవీ ద్వారా జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేసేందుకు బోనీ కపూర్ ఓకే చెప్పారా..? లేదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular