Friday, March 13, 2026
Homeసినిమారామ్ చరణ్‌, శంకర్ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యిందో తెలుసా?

రామ్ చరణ్‌, శంకర్ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యిందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆనందం పెల్లుబుకుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఇంతకాలం లేనిది ఇప్పుడే సడన్ గా తమిళ దర్శకుడైన శంకర్, దిల్ రాజు సంస్థలోకి ఎలా వచ్చాడు అనేది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. వివరాలు ఆరా తీస్తే.. ఆ మధ్య వి.వి. వినాయక్ హీరోగా శీనయ్య అనే చిత్రం ప్రారంభమైంది. ఆ చిత్ర దర్శకుడు నరసింహారావు ఇప్పుడు దిల్ రాజు టీమ్ లోనే ఉన్నారు.

ఆయనకు శంకర్ దర్శకత్వ టీమ్ లో పని చేసిన అనుభవం వుంది. ఆ కాంటాక్ట్ తోనే శంకర్ తో పాన్ ఇండియా మూవీ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారని, దానికి రామ్ చరణ్ అయితే బాగుంటారని కాంటాక్ట్ అయినట్టు తెలిసింది. ఇక దర్శకుడు శంకర్ విషయానికొస్తే.. సాధారణంగా శంకర్ తన చిత్రాలన్నింటిలో ఒక సోషల్ కాజ్ వుండేలా చూస్తారు. ఇందులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ సందేశం వుంటుందని వార్తలు వస్తున్నాయి. ఒకే ఒక్కడు చిత్రం తరహాలో ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని ఇందులో చరణ్ పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దాంతో చరణ్ ను కొత్త కోణంలో చూడబోతున్నామని అభిమానులు ఎగ్జైటింగ్ గా వున్నారు. అంతే కాదు వాళ్లు ఎగిరి గంతేసే మరొక అంశం కూడా వుంది. ఇందులో రామ్ చరణ్ డబుల్ రోల్ లో నటిస్తున్నారట. గతంలో చరణ్ నటించిన నాయక్ ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. అదే మళ్లీ రిపీట్ అవుతుందని, ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular