వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం మామిళ్ళపల్లి సున్నపు రాళ్ళ గనిలో పేలుడు పదార్ధాల విస్ఫోటనం జరిగి 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ వాహనంలో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.