Thursday, January 23, 2025
HomeTrending Newsఆంధ్రా రోగులకు ‘నో’ ఎంట్రి

ఆంధ్రా రోగులకు ‘నో’ ఎంట్రి

కోవిడ్ చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రి నుంచి ఐసియూ బెడ్ కేటాయించినట్లు ఆధారాలు చూపిస్తేనే  పోలీసులు అనుమతిస్తున్నారు. లేనివారిని వెనక్కు పంపుతున్నారు. హైదరాబాద్ లో ఆక్సిజన్ కొరత వుందని ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను కోదాడ సమీపంలోని రామాపురం క్రాస్ రోడ్స్ వద్ద, కర్నూల్ నుంచి వచ్చే వాహనాలను పుల్లూర్ చెక్ పోస్ట్ వద్ద నిలిపి వేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం వున్న పరిస్థితి దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులను అనుమతిచడం లేదని, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చేవారిపై కూడా ఆంక్షలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం కూడా ఓ అధికారిక నిర్ణయం వెల్లడించే ఆలోచనలో వుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్