Thursday, January 23, 2025
Homeతెలంగాణఈటలతో కొండా భేటి!

ఈటలతో కొండా భేటి!

మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సాయంత్రం 5.30 గంటలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ కానున్నారు. శామీర్ పేట లోని రాజేందర్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఇటివలే రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల ఉద్వాసనకు గురయ్యారు.

కొండా 2014 ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ ) తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. 2018 లో తెలంగాణా అసెంబ్లీ కి జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మూడు నెలల క్రితం కొండా కాంగ్రెస్ కు కూడా రాజీనామా చేశారు. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఏ శక్తులతోనైనా కలిసి పని చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.

కెసిఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్న శక్తులను కలుపుకొని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేసే ఆలోచనలో కొండా వున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈటలతో కొండా సమావేశం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్