కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని నాని విమర్శించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శక్తికి మించి పని చేస్తున్నామని, వాక్సిన్, ఆక్సిజన్ సరఫరా విషయంలో మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా పని చేస్తున్నామని వివరించారు.
కరోనా కంటే చంద్రబాబు ప్రమాదంగా మారారని మంత్రి దుయ్యబట్టారు. ఎన్-440కే వేరియంట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనిదే నంటూ బాబు ప్రచారం చేయడం హేయమైన చర్యగా నాని అభివర్ణించారు. కొత్త వైరస్ ఏపిలో లేదని సిసిఎంబి నిపుణులు చెబుతుంటే బాబు దానికి విరుద్ధంగా మామ్తాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు పక్క రాష్ట్రంలో దాక్కుని రాష్ట్రంపై అభాండాలు వేస్తున్నారని, అసలు చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఇంతలా దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి హితవు పలికారు.