కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. కర్ఫ్యూ అమల్లోఉన్నా కేసులు పెరుగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ నిత్యావసరాలకు అనుమతిస్తామని వెల్లడించారు. మెడికల్, అత్యవసర సర్వీసులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. కోవిడ్-19 చైన్ ను నిలుపుదల చేసేందుకే లాక్ డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు.
గత 24 గంటల్లో కర్ణాటకలో 48, 781 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో రాజధాని బెంగలూరులో 21,376 మంది కరోనా బారిన పడ్డారు. 346 మంది మరణించారు. దీంతో యద్యూరప్ప ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. మే 10వ తేది ఉదయం 6 గంటల నుంచి 25వ తేది ఉదయం 6 గంటల వరకూ అమల్లో వుంటుంది. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.