Saturday, January 18, 2025
HomeTrending Newsదారులన్నీ ముత్తుకూరు వైపు

దారులన్నీ ముత్తుకూరు వైపు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టి మొత్తం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరుపై పడింది. కృష్ణపట్నం సమీపంలోని ఈ గ్రామంలో ఆనందయ్య…. కరోనా నివారణకు ఇస్తున్న ఆయుర్వేద మందు కోసం వేలాది మంది ఈ గ్రామానికి క్యూ కడుతున్నారు.

16  రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ ఆయుర్వేద మందు తీసుకుంటే కరోనా నయమవుతోందని, ఈ మందు రెండు చుక్కలు కంట్లో వేసుకోగానే ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని కొందరు బాధితులు చెప్పడంతో వేలాది మంది ఈ మందుకోసం పరుగులు తీస్తున్నారు.

ఈ మందుపై కొందరు లోకాయుక్తను ఆశ్రయించగా జిల్లా కలెక్టర్ ను నివేదిక కోరింది. ఈ మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన లోకాయుక్త ఈ మందును పరిశోధన కోసం ల్యాబ్ కు పంపాలని, అప్పటివరకూ పంపిణి నిలిపివేయాలని ఆదేశించింది.

ఇవాళ కేవలం కరోనా పాజిటివ్ బాధితులకు మాత్రమే పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్ లు ఇతర వాహనాల్లో బాధితులు కృష్ణపట్నం కి చేరుకున్నారు.

ఈ సంరద్భంగా తొక్కిసలాట జరిగింది,  కాసేపు పంపిణి నిలిపివేశారు.  కేవలం 3వేల మందికి సరిపడా మందును మాత్రమె తయారు చేశామని, ప్రభుత్వం సహకరిస్తే వీలైనంత ఎక్కువ మందికి ఈ మందు పంపిణి చేస్తానని ఆనందయ్య చెబుతున్నారు,

స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మందు పంపిణికి చేస్తున్న ప్రాంతానికి వచ్చి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ మందు వల్ల ఎలాటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, కాకపొతే లోకాయుక్త ఆదేశం ప్రకారం ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం జరుగుతోందని వివరించారు. ఈ మందుకు అనుమతి వస్తే మందు పంపిణికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్