-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeఅంతర్జాతీయంకాల్పులు విరమించిన ఇజ్రాయెల్, హమాస్

కాల్పులు విరమించిన ఇజ్రాయెల్, హమాస్

గత 11 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి  ఇజ్రాయెల్, హమాస్ ముగింపు పలికాయి.  ఈజిప్ట్ చొరవతో భేషరతుగా కాల్పుల విరమణకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. హమాస్ దళాలు కూడా కాల్పుల విరమణకు సమ్మతించాయి.

ఈ ప్రతిపాదన అమల్లోకి రాగానే పెద్దఎత్తున ప్రజలు గాజా వీధుల్లోకి వచ్చి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ‘అల్లాహో అక్బర్’ అనే నినాదాలు చేశారు. మరికోతమంది తమ ఇంటి బాల్కనీల్లో నిల్చుని ఈలలు వేయగా మరికొంతమంది గాల్లోకి కాల్పులు జరిపారు.

ఇజ్రాయెల్ – పాలస్తీనా సరిహద్దుల్లోని ఓ మసీదు వద్ద జరిగిన ఆందోళన ఈ యుద్ధానికి దారితీసింది. హమాస్ దళాలు జెరూసలేం వైపు రాకెట్ దాడులు చేసాయి, వాటిని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ కూడా రాకెట్ దాడులతో హమాస్ పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 230  మంది పాలస్తీనియన్లు మరణించగా 2 వేల వరకూ గాయపడ్డారు.

అమెరికా మొదట్లో ఇజ్రాయెల్ ను సమర్ధించింది, కానీ ఈ దాడుల్లో చిన్నారులు, మహిళలు మరణిస్తున్న సంఘటలు వెలుగులోకి వచ్చిన తరువాత యుద్ధం విరమించాల్సిందిగా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవడం ప్రారంభించింది.

కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్