Saturday, January 18, 2025
Homeసినిమానాగ్ - ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిందా? అసలేం జరిగింది.?

నాగ్ – ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిందా? అసలేం జరిగింది.?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్లో సక్సస్ సాధించకపోయినా.. ఓటీటీలో మాత్రం సక్సస్ సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక నాగ్ తదుపరి చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నారు. నాగ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే.. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. షూటింగ్ కి బ్రేక్ పడింది. కరోనా తగ్గిన తర్వాత ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటుంటే..ఈ మూవీ ఆగిపోయింది అనే వార్త బయటకు వచ్చింది.

కారణం ఏంటంటే.. వైల్డ్ డాగ్ మూవీ ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో నాగార్జున ఎంటర్ టైన్మెంట్ మూవీస్ చేయాలి అనుకుంటున్నారు. అందుచేత ప్రవీణ్ సత్తారుకు కథలో మార్పులు చేర్పులు చేయమని నాగార్జున చెప్పారని… ప్రవీణ్ కథలో మార్పులు చేయనని చెప్పాడు. అందుచేత ఈ సినిమా ఆగిపోయింది అనేది ఆ వార్త సారాంశం. అయితే.. ఈ వార్త ఇలా వచ్చిందో లేదో అలా.. నాగ్ టీమ్ అలర్ట్ అయ్యింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ కానుందని మీడియాకి సమాచారాన్ని అందించింది. అందుచేత ఈ మూవీ ఆగిపోయింది అనే వార్తలో వాస్తవం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్