Sunday, January 19, 2025
HomeTrending Newsనాపై ద్వేషంతోనే ఇదంతా! – ఈటెల

నాపై ద్వేషంతోనే ఇదంతా! – ఈటెల

జమున హ్యచరీస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పథకం ప్రకారమే, ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట్ భూముల విషయంలో అధికారులు ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా వుందన్నారు. అధికారులకు వావి వరసలు కూడా తెలియవా అని ప్రశ్నించారు. అధికారుల నివేదికలో జమున భర్త పేరు నితిన్ అని రాశారని, నా పేరు బదులు నా కుమారుడి పేరు పెట్టారని… అంత హడావుడిగా నివేదిక ఇచ్చారని చెప్పారు.

తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను, అధికారులను పెట్టి హడావుడి సృష్టించడం  న్యాయమా అని కెసియార్ ను సూటిగా ప్రశ్నించారు. 2008 తరువాత తాను ఎలాంటి వ్యాపారాలు చేయలేదని, కెసిఆర్ తోనే సుదీర్ఘ ప్రయాణం చేశామని, ఉద్యమంలోనే ఉన్నామని చెప్పారు.

సంబంధంలేని భూములని తనకు అంట గడుతున్నారని, తన ఆస్తులపై, వ్యాపారాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ  జరిపి తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. నన్ను ఎందుకు దూరం చేసుకున్నారో కెసియార్ అంతరాత్మకు తెలుసని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్