నీట్ పిజి పరీక్షలను 4 నెలలపాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడి కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విధులకు ఎంబిబిఎస్ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలని, తక్కువ లక్షణాలున్న కోవిడ్ బాధితులకు ఎంబిబిఎస్ విద్యార్ధులతోనే వైద్యం అందించాలని ప్రధాని సూచించారు. 100 రోజులపాటు కోవిడ్ విధులు పూర్తి చేసుకున్న వైద్యులకు ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రధానమంత్రి విశిష్ట జాతీయ కోవిడ్ సేవా సమ్మాన్ అవార్డుతో సత్కరించాలని నిర్ణయించారు.