Family Counselling :
Q. మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. చాలా బాగా చదివే అమ్మాయి. ఏనాడూ తనకి ఎందులోనూ లోటు చెయ్యలేదు. ఈ మధ్య తన ప్రవర్తనలో ఎంతో తేడా. చదువులో డల్ అయింది. ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడటం, బయట తిరగడం. ఆరా తీస్తే వాళ్ళ స్కూల్ లో ఈమధ్యే చేరిన టీచర్ తో ప్రేమలో ఉందట. పైగా తల్లిదండ్రులుగా మేము తనని పట్టించుకోవడం లేదని, అందుకే అతనికి దగ్గరయ్యానని అంటోంది. మాకు పాప తర్వాత చాలా రోజులకి బాబు పుట్టాడు. ఆ హడావుడిలో కొన్నాళ్ళు అమ్మాయిని పట్టించుకోలేదు. ఇప్పుడేం చేయాలో ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు.
A. మీరు తప్పు చేసారని చెప్పడం కాదు కానీ, ఇంట్లో ఎదిగే అమ్మాయి ఉన్నప్పుడు ఆమె భావాలు తెలుసుకోకుండా మరో సంతానం కావాలనుకోవడం పొరపాటు. సరే, అప్పుడైనా పాపతో మరింత ప్రేమగా ఉండవలసింది పోయి, నిర్లక్ష్యం చేయడం ఇంకో తప్పు . ఒక్కసారి మీ అమ్మాయి స్థానంలో వుండి ఆలోచించండి అన్నాళ్ళూ నెత్తికెక్కించుకున్న అమ్మానాన్నలు ఒక్కసారే పెద్దరికం మీద పడేస్తే ఏం చేస్తుంది? అప్పుడే ఆమెకి తనతో ప్రేమగా మాట్లాడిన టీచర్ నచ్చి ఉంటాడు. పైగా ఇప్పటి సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం చెప్పక్కర్లేదు. చిన్నపిల్లని ప్రేమలోకి దింపిన అతగాడి మానసిక దౌర్బల్యం తెలుస్తూనే ఉంది. స్కూల్ వాళ్ళతో మాట్లాడి అతన్ని సస్పెండ్ చేయించి మంచిపనే చేసారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అమ్మాయి కోరుకునే అమ్మానాన్నల ప్రేమ అందించడం. ఆ ప్రేమే మళ్ళా మీకు దగ్గర చేస్తుంది. ఒక్కసారి తన పైన మీ శ్రద్ధ, చేరువైన అనుబంధం తిరిగి చదువులో కుదురుకునేలా చేస్తుంది. తన చిన్ని తమ్ముడినీ ప్రేమించేలా చేస్తుంది
Family Counselling
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read:
Also Read: