Thursday, January 23, 2025
Homeజాతీయంప్రమాద స్థితిలో దేశం : రాహుల్ ఆవేదన

ప్రమాద స్థితిలో దేశం : రాహుల్ ఆవేదన

వాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. కరోనా విషయంలో కొన్ని సూచనలు ఇస్తూ ప్రధానికి రాహుల్ లేఖ రాశారు.

దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకుందని, కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల మరో లాక్ డౌన్ కు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కరోనా తో దెబ్బతిన్న వారికి ఆర్ధికంగా చేయూత ఇవ్వాలని, వైరస్ మ్యుటేషన్ పై జినోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అధ్యయనం చేయాలని సూచించారు.

వాక్సినేషన్ పై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన ప్రణాళిక లేదన్న రాహుల్ కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరి పార్టీ సమావేశం వర్చువల్ గా నేడు జరిగింది. కరోనాపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పార్లమెంటరి స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహించాలని సోనియా డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్