Thursday, March 28, 2024
Homeసినిమాబాబాయ్-అబ్బాయ్ మల్టీ స్టారర్

బాబాయ్-అబ్బాయ్ మల్టీ స్టారర్

అక్కినేని హీరోల మల్టీస్టారర్ మనం రావడం.. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీ హీరోలకే కాకుండా.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలవడం తెలిసిందే. మనం సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో నందమూరి హీరోలు కూడా కలిసి నటిస్తే.. చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అభిమానుల కల ఇప్పుడు నెరవేరబోతుందని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి నటసింహం బాలయ్యతో ఓ సినిమా చేయనున్నారు. ఆల్రెడీ కథ చెప్పడం.. బాలయ్య ఓకే చెప్పడం జరిగిందట.

అయితే.. ఈ మూవీ సోలో మూవీ కాదని.. మల్టీస్టారర్ అని టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కి బాబాయ్ బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్ రామే. అందుకనే కళ్యాణ్‌ రామ్ – అనిల్ రావిపూడి కలిసి మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే ఇప్పుడు బాలయ్య – కళ్యాణ్‌ రామ్ కాంబినేషన్ కి సరిగ్గా సరిపోయే స్టోరీ రెడీ చేసాడట అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ కి కూడా స్టోరీ నెరేషన్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ లో హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్ పోషించారు.

ఈ క్రేజీ మల్టీస్టారర్ ను షైన్ స్ర్కీన్స్ నిర్మాణ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ నందమూరి మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళితే అభిమానులకు పండగే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్