Wednesday, April 23, 2025
Homeతెలంగాణభారత్ బయోటెక్ తో తెలంగాణ ప్రభుత్వం మంతనాలు

భారత్ బయోటెక్ తో తెలంగాణ ప్రభుత్వం మంతనాలు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ భారత్ బయోటెక్ సి.యం.డి శ్రీ క్రిష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో మంగళవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు కోవిడ్-19 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరికి వ్యాక్సినేషన్ చేపట్టటానికి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయాలని ప్రాధాన్యతనివ్వాలని సి.యం.డి ని కోరారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక వ్యాక్సిన్ లు ఇవ్వటానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మరియు భారత్ బయోటెక్ డైరెక్టర్ డా. సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్