Saturday, April 20, 2024
HomeTrending Newsమరాఠా రిజర్వేషన్లకు సుప్రీమ్ ‘నో’

మరాఠా రిజర్వేషన్లకు సుప్రీమ్ ‘నో’

మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రేం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 50 శాతానికి మించి రిజరేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్హమని స్పష్టం చేసింది.

విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని  చాలాకాలంగా మరాఠాలు పోరాటం చేస్తున్నారు. వారి డిమాండు ని పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్ల శాతం 68కి చేరింది.

ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రేం కోర్టు రాజ్యంగ ధర్మాసనం విచారించింది.  మరాఠా రిజర్వేన్లపై సర్వోన్నత న్యాయస్థానం  అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరింది.  రిజర్వేషన్లు రాజ్యంగానికి విరుద్ధమని సుప్రీమ్ కోర్టు తీర్పు చెప్పింది.  పిజి, మెడికల్ కోర్సుల్లో ఇప్పటికే చేసిన  నియామకాలు కొనసాగుతాయని, ఇకపై ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయవద్దని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్