మే 1వ తేదీ నుంచి అందరికీ కోవిడ్ వాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. వాక్సిన్ పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవాక్సిన్ , కోవిషిల్డ్ తో పాటు రష్యా లో తయారైన స్పుత్నిక్ వాక్సిన్లు అందిస్తారు. అవసరాలకు అనుగుణంగా వాక్సిన్ తయారీని వేగవంతం చేయాలని కేంద్రం సంబంధిత కంపెనీలకు సూచించింది.