ఢిల్లీకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను ప్రధానికి రాశారు. ఢిల్లీ కి ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా నిన్న730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం సరఫరా చేసింది. ఢిల్లీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కోటాను తగ్గించకుండా ప్రతిరోజూ ఇదే మొత్తంలో ఆక్సిజన్ అందించేలా చూడాలని ప్రధానిని కోరారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఢిల్లీకి ఏ మార్గంలో వచ్చినా 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారన్ టైన్ కు వెళ్లాలని నిబంధన పెట్టింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారన్ టైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణలో కరోనా వైరస్ నూతన వేరియంట్ ను గుర్తించిన నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.