రాష్ట్రాలకు అందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. తన అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నిఅయన వెల్లడించారు. మే 1 నుంచి అందరికి వాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీరం తయారు చేసిన కోవిషిల్డ్ ధర ఒక్కడోసు కేంద్ర ప్రభుత్వానికి రూ. 150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 600కు అందిస్తామని సీరం సంస్థ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు ఇచ్చే ధరను 100 రూపాయల మేర తగ్గించి 300 రూపాయలకే అందిస్తామని అదర్ ట్వీట్ చేశారు.