Sunday, February 23, 2025
Homeజాతీయంరాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌

రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘‘నాలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా.. పాజిటీవ్‌గా తేలింది. నాతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తలు తీసుకోండి’’ అని ఆయన ట్విట్లో పేర్కొన్నారు. దేశంలో కొవిడ్‌ టీకాల పంపిణీపై రాహుల్‌ మూడు గంటల క్రితమే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత ఆనంద్‌ శర్మ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల దేశంలో పలువురు అగ్రనేతలకు కొవిడ్‌ సోకింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు నిన్న పాజిటీవ్‌గా తేలారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్