Tuesday, April 15, 2025
HomeTrending Newsలింగోజీగూడలో కాంగ్రెస్ గెలుపు

లింగోజీగూడలో కాంగ్రెస్ గెలుపు

జిహెచ్ఎంసిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు, అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే గుండెపోటుతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.  ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున రమేష్ గౌడ్ కుమారుడు నిఖిల్ గౌడ్ పోటి చేశారు. బిజెపికి మద్దతుగా టిఆర్ఎస్ తమ పార్టీ నుంచి అభ్యర్ధిని నిలబెట్టలేదు. నేడు ఓట్ల లెక్కింపు జరిగింది.

కాంగ్రెస్ పార్టి అభ్యర్ధి దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి 1249 ఓట్ల మెజార్టీతో అఖిల్ గౌడ్ పై విజయం సాధించారు.  ఈ డివిజన్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో వుంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని మొత్తం 10  డివిజన్లను బిజెపి కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్