Saturday, January 18, 2025
Homeసినిమావరుణ్ సందేశ్ సరికొత్త ప్రయోగం

వరుణ్ సందేశ్ సరికొత్త ప్రయోగం

హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే యూత్ ని బాగా ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్. ఆతర్వాత కొత్త బంగారులోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ తదితర చిత్రాల్లో నటించి మెప్పించినా ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ రావడంతో కెరీర్ బాగా వెనకబడ్డాడు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇందువదన సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు.

ఈరోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఫస్ట్ లుక్ పెయింటిగ్ లా కళాత్మకంగా ఉందని చెప్పచ్చు. ఈ ఫస్ట్ లుక్ ని అనూహ్యమైన స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఇందులో వరుణ్ సందేశ్ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఖచ్చితంగా వరుణ్ కి మంచి విజయాన్ని అందిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు పాటలకు సాహిత్యం భాస్కరభట్ల రవి కుమార్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. మరి.. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ సందేశ్ ఇందువదన సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఆశిద్దాం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్