Saturday, January 18, 2025
HomeTrending Newsసంక్షోభంలో రాజకీయాలా? – బాబుపై సజ్జల ఫైర్

సంక్షోభంలో రాజకీయాలా? – బాబుపై సజ్జల ఫైర్

కోవిడ్ రెండో దశ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే, ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు  చేస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్ ద్వారా  రాజకీయాలు చేస్తూ  రాష్ట్రానికి ఒక చీడ మాదిరిగా మారారని సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు, ప్రభుత్వంపై చంద్రబాబు  చేస్తున్న ఆరోపణలను  ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా జనం మీదకు తోస్తుంటే అసహ్యం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సంక్షోభాలు తలెత్తినప్పుడు రాజకీయాలు పక్కకు పోతాయని, ఎవరి చేతనైన సహాయం చేయడానికి సామాజిక సంస్థలు ముందుకు వస్తాయని… . కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేచింది మొదలు అందరినీ రెచ్చగొట్టడుతున్నారని సజ్జల దుయ్యబట్టారు.

చంద్రబాబు కుంగిపోయిన, కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా ఉన్నాడని…తన ప్రపంచంలో తాను మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు, ఇక్కడికి రావడానికి కూడా భయపడి హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడతున్నారని, అయన స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రజలకు భరోసా ఇవ్వాలని లేదా ఆయన అక్కడే ఉండి తన కొడుకును అయినా ప్రజల వద్దకు పంపిచాలని హితవు పలికారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్