రాష్ట్ర ప్రబుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. సంస్థ డైరెక్టర్లు తమ కార్య కలాపాలు కొనసాగించవచ్చని, రోజువారి కార్యకలాపాలు పర్యవేక్షించ వచ్చని కోర్టు తెలిపింది.
డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
సంగం డెయిరీ లో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేసిన ఏసిబి సంస్థ చైర్మన్ ధూళిపాళ నరేంద్రతో పాటు ఎండి గోపాలకృష్ణను ఏసిబి అరెస్టు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు లో శిక్ష అనుభవిస్తూ కోవిడ్ సోకినందున ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే డెయిరీ ని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై హైకోర్టును సంగం సంస్థ ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం చెల్లదని పేర్కొంది.