Saturday, March 7, 2026
Homeసినిమాస్పెషల్ సాంగ్...? నేనా?

స్పెషల్ సాంగ్…? నేనా?

ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ ని బాగా ఆకట్టుకుని.. ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్. ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ – యువ సమ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందిన వెంకీమామ సినిమాలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ సాధించినా ఈ అమ్మడికి  ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాలేదు. ఇదిలా ఉంటే.. పాయల్ బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజు మూవీ చేయాలని నాగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

గత కొంతకాలంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జులై నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. అభిమానులు ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. బంగార్రాజులో పాయల్ స్పెషల్ సాంగ్స్ చేస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఇది వాస్తవమేనా..? కాదా..? అనుకుంటుంటే.. సోషల్ మీడియా ద్వారా పాయల్ క్లారిటీ ఇచ్చిది. బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం లేదు. ఇదనే కాదు ఏ సినిమాలోను స్పెషల్ సాంగ్ చేయడం లేదు. క్లారిటీ ఇచ్చేందుకే పోస్ట్ పెట్టానుంటూ పాయల్ క్లారిటీ ఇచ్చింది. అదీ.. సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular