Wednesday, July 3, 2024
HomeTrending Newsభారత్ జోడో యాత్రకు సోనియా, ప్రియాంక

భారత్ జోడో యాత్రకు సోనియా, ప్రియాంక

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ రోజు (శనివారం) పునఃప్రారంభమైంది. శుక్రవారం విరామం తీసుకున్న తర్వాత శనివారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’ ను ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర కర్ణాటకలో ప్రవేశించిన తర్వాత ఏదో ఓ చోట పాల్గొనాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిర్ణయించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్ర ఈ నెల 30న కర్ణాటకలో ప్రవేశిస్తుంది. సోనియా, ప్రియాంక పాల్గొంటారనే సమాచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్  కూడా ధ్రువీకరించారు. వీరిద్దరూ వేర్వేరుగా ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ చేసిన ఏర్పాట్ల పట్ల ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసింది.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర 17వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. 12 కిలోమీటర్ల యాత్ర అనంతరం కేరళలోని  అంబల్లూరు కూడలి వద్ద నేతలు, కార్యకర్తలు విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు టాలోర్ బైపాస్ జంక్షన్ వద్ద యాత్ర పునఃప్రారంభమవుతుంది. త్రిసూర్ వడక్కుమ్నాథన్ దేవాలయానికి చేరుకుంటారు. ఈ యాత్రకు త్రిసూర్ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని కాంగ్రెస్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఓ రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత 17వ రోజు భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం 6.35 గంటలకు పెరంబ్ర జంక్షన్ నుంచి  ప్రారంభమైందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Also Read : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్