Monday, July 1, 2024
HomeTrending Newsకర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో.. భారత్ జోడో యాత్ర జోష్

కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో.. భారత్ జోడో యాత్ర జోష్

తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్‌కు బలం ఉండడంతో.. ఆ ఉత్సాహం రాహుల్ పాదయాత్రలో కనిపిస్తోంది. ఆదివారం రాత్రి జోరుగా వర్షం పడుతున్నా రాహుల్ తన ప్రసంగం వర్షంలోనే కొనసాగించటం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. బండిపాళ్య ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే భారీ వర్షం పడింది. రాహుల్ గాంధీ వర్షంలో తడుస్తూనే మాట్లాడారు.

కార్యకర్తలు, నాయకులు వర్షంలో తడుస్తూ నిలబడినా.. మరికొందరు అక్కడి సభలో కుర్చీలనే గొడుకులుగా మార్చుకుని రాహుల్ మాటలను ఆసక్తిగా విన్నారు. కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో భారత్ జోడో యాత్ర జోష్ నింపిందని హస్తం నేతలు హుషారుగా ఉన్నారు. అటు కన్నడ నేత మల్లికార్జున ఖర్గే ఏ.ఐ.సి.సి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కన్నడ కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. త్వరలోనే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీని ఓడించే అవకాశం ఉన్న రాష్ట్రం కూడా కర్నాటక కావడంతో.. పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసే పనిలో ఉన్నారు కర్నాటక కాంగ్రెస్ నేతలు.

మరోవైపు ఈ రోజు సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మైసూరు చేరుకుంటున్నారు. ముందుగా దసరా సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని… కొడగు జిల్లాలోని మడికేరి దగ్గరి రిసార్ట్ కు వెళతారు. రేపు ఎల్లుండి రాహుల గాంధీ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ, ప్రియంక గాంధీ పాల్గొంటారు.

Also Read: తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్