తెలుగు రియాలిటీ షోల్లో బిగ్ షో.. బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ 6 స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ 2 సీజన్ కు నాని హోస్ట్ కాగా ఆతర్వాత నుంచి వరుసగా నాగార్జునే హోస్ట్ గా ఉంటున్నారు. నాగార్జున హోస్ట్ గా చేసిన అన్నీ సీజన్ లు సూపర్ సక్సెస్ అయ్యాయి. నాగార్జున తనని తాను బాగా మార్చుకుని.. ఆడియన్స్ ఎంటర్ టైన్ అయ్యేలా షోను రక్తి కట్టిస్తుండడం విశేషం.
ఇటీవల బిగ్ బాస్ 6 సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జున హోస్ట్ కాగా ఈ లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న ప్రసారం అయ్యింది. చాలా గ్రాండ్ గా ఈ సీజన్ స్టార్ట్ చేశారు. ఈ సీజన్ లో 21 మంది కంటెస్టంట్లు ఉన్నారు. ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. గతంలో సీజన్స్ టీఆర్పీ రేటింగ్స్ ఒకసారి చూస్తే… బిగ్ బాస్ సీజన్ 1 (ఎన్టీఆర్) కు 16.18 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సీజన్ 2 (నాని) 15.05, సీజన్ 3 (నాగార్జున) 17.9, సీజన్ 4 (నాగార్జున) 18.5, సీజన్ 5 (నాగార్జున) 15.71 టీఆర్పీ రేటింగ్ రాగా సీజన్ 6 (నాగార్జున) 8.86 రేటింగ్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది.
ఆరవ సీజన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అతి తక్కువ టీఆర్పీ ను నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా షాకింగ్ టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. నామినేషన్లు, ఎలిమినేషన్లతో హీటెక్కుతున్న ఈ షో రానున్న రోజుల్లో బాగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. మరి.. ఈ షో ఎంత వరకు మెప్పిస్తుందో..? ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.