అఖిల్.. బాలీవుడ్ మూవీని నాగ్ సెట్ చేశారా..?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం ‘ఏజెంట్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ మూవీ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఏజెంట్ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అలాగే అఖిల్ బాలీవుడ్ మూవీ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు.

ఇప్పుడు నాగార్జున అఖిల్ బాలీవుడ్ మూవీని సెట్ చేశార‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. నాగార్జున ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయంలో కనిపించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు నాగ్ ముంబై ఎందుకు వెళ్లార‌ని అభిమానుల్లో విస్త్రతంగా చర్చ మొదలైంది. కరణ్ జోహార్ నిర్మించిన బ్రహ్మాస్త్ర మూవీలో నాగ్ నటించాడు. నాగ్ పాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

అయితే.. బ్ర‌హ్మ‌స్త స‌క్సెస్ ని టీమ్ తో షేర్ చేసుకోవ‌డంతో పాటు అఖిల్ ని బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్య‌త‌ను క‌ర‌ణ్ జోహార్ కి అప్ప‌గించేందుకు వెళ్లార‌ని టాక్ వినిపిస్తోంది. ఏజెంట్ మూవీ రిలీజ్ త‌ర్వాత అఖిల్ తో క‌ర‌ణ్ జోహార్ బాలీవుడ్ మూవీ చేయ‌నున్నాడ‌ని.. టాక్ వినిపిస్తోంది.

Also Read: ఏజెంట్ వ‌చ్చేది ఎప్పుడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *