అక్కినేని అఖిల్.. వ‌రుస‌గా మూడు ఫ్లాపుల త‌ర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ తో స‌క్సెస్ సాధించాడు. ఈ సినిమాతో ట్రాక్ లోకి రావ‌డంతో అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ పై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో ఈ మూవీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య న‌టిస్తుంది.

ఇటీవ‌ల ఏజెంట్ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో  అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఏజెంట్ మూవీ క‌రోనా కార‌ణంగా చాలా సార్లు వాయిదాప‌డింది. ఆగ‌ష్టులో రిలీజ్ అని ప్ర‌క‌టించారు కానీ.. రిలీజ్ కాలేదు. ఆత‌ర్వాత ఎప్పుడు అని ప్ర‌క‌టించ‌లేదు మేక‌ర్స్. ద‌స‌రాకి వస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఏజెంట్ ద‌స‌రాకి రావ‌డం లేదు అని క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది.

ఎందుకంటే.. ద‌స‌రాకి వ‌స్తున్న ది ఘోస్ట్, గాడ్ ఫాద‌ర్, జిన్నా చిత్రాలు ఆల్రెడీ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాయి. మ‌రి.. క్రిస్మ‌స్ కి వ‌స్తుందా అంటే.. ఈ టైమ్ కి బాల‌య్య 107 మూవీ వ‌స్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఇక సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, ప్ర‌భాస్ ఆదిపురుష్‌, విజ‌య్ వార‌సుడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఏజెంట్ వ‌చ్చేది ఎప్పుడు అనేది ఆస‌క్తిగా మారింది. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ఏజెంట్ రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. మేక‌ర్స్ త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: ఆ రోజున బాల‌య్య బదులు అఖిల్ సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *