5.7 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeసినిమాబాల‌య్య మూవీ టైటిల్ కి ముహుర్తం ఫిక్స్

బాల‌య్య మూవీ టైటిల్ కి ముహుర్తం ఫిక్స్

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు, బాల‌య్య స‌ర‌స‌న అందాల తార శృతిహాస‌న్ న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అయితే.. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ ఏంటనేది ప్ర‌క‌టించ‌లేదు. ‘జై బాల‌య్య‌’, అన్న గారు టైటిల్స్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే… ఇప్పుడు టైటిల్ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా టైటిల్ ని అనౌన్స్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట మేక‌ర్స్. అంతే కాకుండా విజ‌య‌ద‌శ‌మికి టైటిల్ తో పాటు స్పెష‌ల్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇంత‌కీ.. ఏ టైటిల్ ని ఫిక్స్ చేశారంటే.. ‘జై బాల‌య్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని టాలీవుడ్ లో బ‌లంగా వినిపిస్తుంది. జై బాల‌య్య అంటే.. అభిమానుల‌కు బాగా రీచ్ అవుతుంది. అందుక‌నే ఈ టైటిల్ నే ఫిక్స్ చేశార‌ని తెలిసింది. ఇక మూవీ రిలీజ్ విష‌యానికి వ‌స్తే.. కుదిరితే డిసెంబ‌ర్ నెలాఖ‌రున కుద‌ర‌క‌పోతే.. సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే.. టైటిల్ అండ్ రిలీజ్ పై క్లారిటీ రావాలంటే విజ‌య‌ద‌శ‌మి వ‌ర‌కు ఆగాల్సిందే.

Also Read:  బాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీ ఇంట్ర‌స్ట్ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్