Friday, June 12, 2026
Homeసినిమాబాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీ ఇంట్ర‌స్ట్ అప్ డేట్

బాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీ ఇంట్ర‌స్ట్ అప్ డేట్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది.  మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ ట‌ర్కీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ద‌స‌రాకి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు.  సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని  టాక్ వినిపిస్తోంది.

ఇక బాల‌య్య నెక్ట్స్ మూవీ విష‌యానికి వ‌స్తే… స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక వైపు లొకేషన్స్ వేట మొదలుకుని సెట్టింగ్స్ నిర్మాణం వరకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి, ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల న‌టించ‌నుంది.

ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అరవింద్ స్వామి నటించబోతున్నట్లుగా సమాచారం. ఆయన్ను ఇటీవలే కలిసి స్టోరీ లైన్ చెప్పి ఆయనతో ఓకే చెప్పించినట్లుగా టాక్ వినిపిస్తోంది. సాధారణంగా అరవింద్ స్వామి ఆషామాషీ పాత్రలకు ఓకే చెప్పేరకం కాదు. అందుచేత‌ ఖ‌చ్చితంగా ప్రత్యేకమైన పాత్ర అయి ఉంటుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : బాల‌య్య 107 రిలీజ్ డేట్ ఫిక్స్? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular