ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే‘. ఈ చిత్రానికి మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో చాలా ప్రెస్టేజీయ‌స్ గా నిర్మిస్తుంది.

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జ‌రిగింది. చాలా సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకోవ‌డం విశేషం. అయితే.. ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ప్రాజెక్ట్ కే ఏంటి..?  అస‌లు ఇందులో ఏం చెప్ప‌బోతున్నారు..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్ వ్యూలో అమితాబ్ ప్రాజెక్ట్ కే గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే.. తన లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని, సినిమా వచ్చినప్పుడు అందరినీ షాక్‌కి గురిచేస్తానని చెప్పారు. అంతే కాకుండా.. తన పై చాల మేకప్ ఉపయోగించబడిందని.. షూట్‌కు సిద్ధం కావడానికి రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. అమితాబ్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీని 2024లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.

Also Read : హాలీవుడ్ స్థాయిలో ప్రాజెక్ట్ కే :అశ్విని దత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *