Friday, June 12, 2026
Homeసినిమామ‌హేష్‌, జ‌క్క‌న్న మూవీలో ర‌ణ్ భీర్..?

మ‌హేష్‌, జ‌క్క‌న్న మూవీలో ర‌ణ్ భీర్..?

బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో రాజ‌మౌళిచ‌రిత్ర సృష్టించారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై అందరికీ సహజంగానే  ఆసక్తి ఉంటుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి భారీ పాన్ ఇండియా మూవీ  చేస్తున్నారు.  దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్. నారాయ‌ణ దీన్ని నిర్మిస్తున్నారు.  విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకూ ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు.

ఇదిలా వుంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మ‌రో హీరో క్యారెక్ట‌ర్ కూడా ఉంద‌ని.. ఆ క్యారెక్ట‌ర్ ను టాలీవుడ్ హీరోతోనే చేయించాలనుకుంటున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజా వార్త ఏంటంటే.. ఈ మూవీలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రణ్‌ బీర్ కపూర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

దక్షిణాది భాషల్లో ఈ మూవీకి దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టాలనే ఆలోచనతో రాజ‌మౌళి ప్రతీ ప్లాట్ ఫామ్ ని వాడుకుంటూ ‘బ్రహ్మాస్త్రం’ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం అలియాను తీసుకొని వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చిన జక్కన్న ఇప్పుడు మహేష్ మూవీ కోసం రణ్ బీర్ ని సెలెక్ట్ చేసి భారీ మల్టీస్టారర్ గా తీర్చి దిద్దుతున్నారని టాక్. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular