Friday, August 14, 2026
Homeసినిమాప్రాజెక్ట్ కే లేటెస్ట్ అప్ డేట్

ప్రాజెక్ట్ కే లేటెస్ట్ అప్ డేట్

ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే‘.  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తుంటే.. కీల‌క పాత్ర‌లో అమితాబ్ న‌టిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇందులో ఐదు భారీ యాక్ష‌న్ సీక్వెన్సెస్ ఉంటాయ‌ట‌. మూడ‌వ ప్ర‌పంచ యుద్దం నేప‌ధ్యంలో ఈ సుదీర్ఘ యాక్ష‌న్ సీన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. ఇందు కోసం హాలీవుడ్ కి చెందిన ఐదుగురు ఫైట్ మాస్ట‌ర్స్ ని రంగంలోకి దింపార‌ట నాగ్ అశ్విన్. ఒక్కో యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక్కో ఫైట్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే అవెంజ‌ర్స్, గాడ్జిల్లా, కింగ్ కాంగ్ త‌దిత‌ర హాలీవుడ్ చిత్రాల‌కు ఉప‌యోగించిన కెమెరాల‌ను ఈ మూవీకి ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది.

ఈ  చిత్రానికి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు.. స్క్రిప్టు విష‌యంలో సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు రాని స‌రికొత్త పాయింట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేయ‌నున్నారు.

Also Read: ప్రాజెక్ట్ కే పై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular