Sunday, June 7, 2026
Homeసినిమావినరో భాగ్యము విష్ణు కథ 'దర్శన' లిరికల్ సాంగ్ రిలీజ్

వినరో భాగ్యము విష్ణు కథ ‘దర్శన’ లిరికల్ సాంగ్ రిలీజ్

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” “బంగారం” పాటలకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  ‘దర్శన’ సాంగ్ లిరికల్ వీడియోను  విడుదల చేశారు  భాస్కర భట్ల రవికుమార్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular