మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” “బంగారం” పాటలకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  ‘దర్శన’ సాంగ్ లిరికల్ వీడియోను  విడుదల చేశారు  భాస్కర భట్ల రవికుమార్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *