Monday, June 8, 2026
Homeసినిమా'వేద' మోషన్ పోస్టర్ విడుదల

‘వేద’ మోషన్ పోస్టర్ విడుదల

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఐకానిక్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రం ‘వేద’. ఇది శివరాజ్‌కుమార్‌ కి 125వ చిత్రం. అంతే కాకుండా అతని భార్య గీత పేరిన స్థాపించిన గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్‌లో మొదటి వెంచర్‌గా వస్తోంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్,  మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ ” సినిమాను కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ.. నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాం. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీకి మన తెలుగులో కూడా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు. ఈ కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా త్వరలో మరిన్ని గొప్ప సినిమాలను రిలీజ్ చేయబోతున్నాను. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించింది. తెలుగులో కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular