ఇండోనేషియాలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైంది. భారీ భూకంపం ధాటికి జావా ద్వీపంలో 20మంది మృతిచెందగా, మరో 300 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. పది కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రం ప్రకంపనలు సృష్టించింది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. భూకంప ప్రభావం పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
జకార్తాలో ఇటీవలే జీ 20 దేశాల సమావేశాలు జరిగాయి. ప్రపంచంలోని అగ్రదేశాల నేతలు అందరు ఆ సమయంలో ఇండోనేసియాలో ఉన్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.