Thursday, March 28, 2024
HomeTrending NewsArun Goel : ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయెల్ బాధ్యతలు స్వీకరణ

Arun Goel : ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయెల్ బాధ్యతలు స్వీకరణ

భార‌త ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా ఇవాళ అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రెండు రోజుల క్రితం ఆయ‌న‌కు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో ముగ్గురు క‌మీష‌న‌ర్లు ఉంటారు. అయితే మే నెల‌లో సుశీల్ చంద్ర రిటైర్ కావ‌డంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అనుప్ చంద్ర పాండే మ‌రో క‌మీష‌న‌ర్‌గా ఉన్నారు. ప్రస్తుతం నేపాల్‌లో జరుగుతున్న జాతీయ ఎన్నికల కోసం అంతర్జాతీయ పరిశీలకునిగా ఉన్న CEC Sh రాజీవ్ కుమార్, Sh అరుణ్ గోయెల్‌ను వ్యక్తిగతంగా పిలిచి, అతని నియామకంపై అభినందనలు తెలిపారు.

అరుణ్ గోయ‌ల్‌ది 1985వ బ్యాచ్‌. పంజాబ్ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆయ‌న‌. డిసెంబర్ 31వ తేదీన ఆయ‌న రిటైర్ కావాల్సి ఉంది. కానీ న‌వంబ‌ర్ 18వ తేదీన ఆయ‌న స్వ‌చ్ఛంద విర‌మ‌ణ చేశారు. 2025 ఫిబ్ర‌వ‌రిలో రాజీవ్ కుమార్ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత సీఈసీగా గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ లేదా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా ఓ వ్య‌క్తి ఆరేళ్ల పాటు విధులు నిర్వ‌ర్తించ‌వ‌చ్చు లేదా ఆ వ్య‌క్తి 65 ఏళ్లు నిండేవ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌వ‌చ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్